తెలంగాణ ఎన్నికలపై హీరో నిఖిల్ ట్వీట్.!

SMTV Desk 2018-12-11 11:23:08  Nikhil Siddartha, KTR, Telangana Elections

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ ఎన్నికల ఫలితాలల్లో తెరాస అత్యధిక మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ఇంతవరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 18 చోట్ల ఆధిక్యత చూపుతోంది. ఈ ఫలితాలపై యువ నటుడు నిఖిల్ సిద్దార్థ ట్విట్టర్ లో స్పందించాడు. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుందని అన్నాడు.

‘క్లీన్ స్వీప్ టీఆర్ఎస్... శుభాకాంక్షలు కేటీఆర్ టీఆర్ఎస్ అన్నా... మరో ఐదేళ్లు సంతోషంగా అభివృద్ధిపై దృష్టిని సారించండి. మీరు బంగారు తెలంగాణను తెస్తారని మేము నమ్ముతున్నాం" అని ట్వీట్ పెట్టాడు. లియొనార్డో డికాప్రియో టైటానిక్ హీరో ఎమోజీని కూడా తన ట్వీట్‌కు జోడించాడు.