50వేల మెజార్టీతో గెలుస్తా: వంటేరు

SMTV Desk 2018-12-09 14:26:27  50000 ,votes, vanteru prathap reddy

హైదరాబాద్ , డిసెంబర్ 09 :గజ్వేల్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సిఎం కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌పై నేను సుమారు 50,000 ఓట్లు మెజార్టీతో గెలువబోతున్నాను. ఈవిఎంలలో ఫలితాలను వివి ఫ్యాట్ రశీదులతో సరిపోల్చి చూడాలని నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. లేకుంటే ఈవిఎమ్ లను తెరాస ట్యాంపరింగ్ చేయించే అవకాశం ఉంది. వొకవేళ ఎన్నికల సంఘం నా అభ్యర్ధనకు అంగీకరించనట్లయితే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను,” అని చెప్పారు.