67.7% పోలింగ్ నమోదు: ఈసీ

SMTV Desk 2018-12-08 11:16:29  Telangana elections, EC,

హైదరాబాద్, డిసెంబర్ 08: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 67.7 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రధానాదికారి రజత్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. ఇది ఇంచుమించు గత ఎన్నికలలో పోలింగ్ శాతంతో సమానంగా ఉందని చెప్పారు. కానీ సమస్యాత్మక నియోజకవర్గాలలో 4 గంటలలోపు, మిగిలిన 106 నియోజకవర్గాలలో 5గంటలలోపు వచ్చి క్యూలో నిలబడి చాలామంది ఓట్లు వేసారు. ఆ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కలు తీయవాల్సి ఉంది. కనుక పూర్తి వివరాలను శనివారం తెలియజేస్తామని రజత్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. కనుక రాష్ట్రంలో ఈసారి సుమారు 70-71 శాతం పోలింగ్ నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.