రేవంత్ అరెస్ట్ పై ట్విట్టర్ లో స్పందించిన రాహుల్ !

SMTV Desk 2018-12-04 16:53:24  Rahul Gandhi, Revanth Reddy, Kcr

న్యూఢిల్లీ,డిసెంబర్ 4: కాంగ్రెస్ నేత కొడంగల్ మహాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. అరెస్టులతో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని తెరాస అడ్డుకోలేదని ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ ధోరణికి పరాకాష్ఠే రేవంత్‌ రెడ్డి అరెస్టు అని ధ్వజమెత్తారు. తెరాస ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, ఓటమి భయంతోనే రేవంత్‌ను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. తెరాసను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారని రాహుల్‌ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.