నోరు జారిన బాబు..! మెంటలెక్కిందన్న కేసీఆర్..!

SMTV Desk 2018-12-03 13:48:05  Chandrababu,KCR

హైదరాబాద్,డిసెంబర్ 3: ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఓ రోడ్ షోలో నోరుజారి కాంగ్రెస్ ను ఓడించాలని అన్నారు, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని గుర్తుచేసిన కేసీఆర్ చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడారు.

"కాంగ్రెస్‌ పార్టీని ఓడియ్యాలని చంద్రబాబు అంటుండు. ఆయనమో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాడు . ఏమన్న కిందమీదకు అయ్యిందేమో. ఏ పార్టీకి మద్దతు ఇస్తుండో దాన్నే ఓడించాలంటుండు. మెంటలయ్యిందేమో చూపీయండి" అని వ్యంగ్యాస్త్రాలు వేశారు.

తాను తెలంగాణకు కాపలా కుక్కలాగా పని చేస్తేనే 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నానని, చంద్రబాబు తన పాలనలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా కూటమి రూపంలో పెనుముప్పు తెలంగాణను కబళించాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆంధ్రాకు పోయిన బాబును, కాంగ్రెస్ నాయకులు నెత్తిన పెట్టుకుని తీసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు బాబు పెత్తనం అవసరం లేదని వ్యాఖ్యానించారు.