ఆరోజు అందరికీ సెలవు: రజత్‌కుమార్‌

SMTV Desk 2018-11-30 10:54:52  rajath kumar,telangana election

హైదరాబాద్, నవంబర్ 30: డిసెంబరు7వ తేదీన పోలింగ్ జరుగనుంది కనుక ఆరోజున రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్థలు కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన శలవును ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ఆదేశించారు. ఉద్యోగులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్థలు తప్పనిసరిగా అనుమతించాలని లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పోలింగ్ బూతులలో సిసి కెమెరాలను, ఆలాగే వీడియో గ్రాఫర్లతో వీడియో రికార్డింగ్ కూడా చేయిస్తున్నామని రజత్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. పోలింగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చాలా చురుకుగా చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.105 కోట్లు నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. కొడంగల్‌లో జరిగిన ఐ‌టి దాడులలో రూ.51 లక్షల నగదు పట్టుబడినట్లు రజత్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో 2.80 కోట్లు మంది ఓటర్లున్నారని, వారందరూ ఓటింగ్ లో పాల్గొనేలా చేయడం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు.