ప్రజా కూటమి మేనిఫెస్టో

SMTV Desk 2018-11-26 19:44:21  Praja Kutami, Manifesto, congress, tdp, cpm, tjs

హైదరాబాద్ , నవంబర్ 26: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్.. అని పార్టీల పేరుతో విడివిడిగా కాకుండా ‘కామన్ మినిమం ప్రోగ్రాం పేరుతో వొకే మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కనీస ఉమమ్మడి ప్రాణాళిక అమలు బాధ్యతను ఉమ్మడిగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రోగ్రాం అమలు బాధ్యతను టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు కట్టబెట్టారు. పాలనా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని మేనిఫెస్టోలోపేర్కొన్నారు. రైతులు, యువత, వృద్ధులను లక్షంగా చేసుని ప్రణాళికను రూపొందించారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ

వృద్ధులకు రూ. 2000, నిరుద్యోగులకు రూ. 3000 పింఛను

ఆసరా పథకం లబ్ధిదారుల వయసు 65 నుంచి 58 తగ్గింపు

ఏటా ఉద్యోగ నియామకాలు, తొలి ఏడాది లక్ష నియామకాలు

ప్రజలకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా

రైతుకు ప్రతి ఏడాది ఎకరాకు రూ. 10 వేల పెట్టుబడి సాయం

జలవిధానం , గొలుసుకట్టు చెరువుల మరమ్మతు

విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర

వ్యవసాయ ధరల స్థిరీకరణ కోసం రూ. 10 వేల కోట్లతో నిధి

100 యూనిట్లలోపు వాడే గృహవినియోగదారులకు ఉచిత విద్యుత్

నిరుపేదలందరికీ ఇళ్లు.. గృహ నిర్మాణ సంస్థ ఏర్పాటు

ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజలు నియంత్రణకు కమిషన్

హైస్కూలు స్థాయి నుంచి విద్యార్థులందరికీ రెసిడెన్షియల్ విద్య

జిల్లాకు వొక ఇంటినీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్

పట్టణాలలో ఉచిత బస్తీ క్లినిక్కులు

ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ

గ్రామ పంచాయతీల బలోపేతం

జిల్లాలు, జోనల్ వ్యవస్థల సమీక్ష

జర్నలిస్టులకు ఇళ్లు, వైద్యం