వంటేరు ప్రతాప్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

SMTV Desk 2018-11-26 14:21:06  Police, Vanteru Prathap reddy

హైదరాబాద్, నవంబర్ 26: ర్యాలయం ముందు నిరాహారదీక్షకు కూర్చొని నిరసన తెలియజేశారుకాంగ్రెస్‌ అభ్యర్ధిగా గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీకి దిగిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదివారం గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కా. గజ్వేల్ నియోజకవర్గంలో తెరాస నేతలు విచ్చలవిడిగా ప్రజలకు మద్యం సరఫరా చేస్తున్నా, ప్రలోభలకు గురిచేస్తున్న రిటర్నింగ్ అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను, తన అనుచరులను వేదిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ఇళ్ళలోకి కూడా ప్రవేశిస్తూ సోదాల పేరుతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో తిష్ట వేసి నియోజకవర్గాన్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకొని పోలీసులను కూడా నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఆయన కనుసన్నలలో పనిచేస్తున్న తెరాస నేతలు కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్ లో పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాస ఏజంట్లుగా మారి పనిచేస్తున్నారని ఆరోపించారు. తాను రిటర్నింగ్ అధికారికి వీటి గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకొనందుకు నిరసనగానే నిరాహారదీక్షకు కూర్చోన్నానని వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఆయనను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.