119 స్థానాలకు 1,824 మంది పోటీ

SMTV Desk 2018-11-23 15:16:09  TRS, Telanagan elections,

హైదరాబాద్, నవంబర్ 23: ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలకు 3,584 దాఖలు కాగా, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ రెబెల్ అభ్యర్ధులను బుజ్జగించుకొని వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేయగలిగాయి.

శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసిన తరువాత ఇంకా 1,824 మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు. అంటే దాదాపు 50 శాతం మంది అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకొన్నారన్న మాట. ఈ పరిణామం అన్ని పార్టీలకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.

నిన్న నామినేషన్ల గడువు ముగిసిన తరువాత పాత 10 జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారో ఎన్నికల సంఘం వొక ప్రకటన ద్వారా తెలియజేసింది. వాటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 15 నియోజకవర్గాలకు 313 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, నిజామాబాద్‌ జిల్లాలో 9 నియోజకవర్గాలకు 91 మంది అభ్యర్ధులున్నారు.

తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 123 మంది అభ్యర్థులు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 178 మంది అభ్యర్థులు
మెదక్‌ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 124 మంది అభ్యర్థులు
నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 211 మంది అభ్యర్థులు
వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 172 మంది అభ్యర్థులు
నిజామాబాద్‌ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 91 మంది అభ్యర్థులు
కరీంనగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు
ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 133 మంది అభ్యర్థులు
రంగారెడ్డి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో 304 మంది అభ్యర్థులు
హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో 313 మంది అభ్యర్థులు