పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరం

SMTV Desk 2018-11-23 13:46:43  TRS party, MLC yadav reddy

హైదరాబాద్,, నవంబర్ 23: టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ సభ్యుడు కే. యాదవరెడ్డిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే దానిపై స్పందించిన యాదవరెడ్డి పార్టీ నుంచి తనను బహిష్కరించినట్లు సమాచారం అందలేదని ఆయన పేర్కొన్నారు. తనను వివరణ అడగకుండా పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరమన్నారు. అలాగే టిఆర్‌ఎస్‌ పార్టీకి సిద్ధాంతాలు లేవని, నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, దమ్ముంటే నిరూపించాలని ఆయన ఆరోపించారు