హైదరాబాద్, నవంబర్ 16: టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు వద్ద ఓఎస్‌డీ(ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ ) గా విధులు చేస్తున్న దేశపతి శ్రీనివాస్ తన వృత్తి కి రాజీనామా చేశారు. కేసీఆర్‌తోపాటు అతను కూడా ఎన్నికల సభల్లో పాల్గొనలిసిరావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనివాస్ చెప్పారు.
ఎన్నికల షరతుల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉండే వ్వక్తి ఎన్నికల సభల్లో, ప్రచారంలో పాల్గొనడానికి వీలుకాదు. ఇందువల్లనే తాను రాజీనామా చేసినట్టు దేశపతి తెలిపారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపానని పేర్కొన్నారు. కాగా, దేశపతి శ్రీనివాస్ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.