కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఇంద్రారెడ్డి తనయుడు

SMTV Desk 2018-11-15 18:20:57  Congress, Mahakutami, Sabitha indrareddy, Karthik reddy

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ లో తెరాస కు వ్యతిరేఖంగా ఏర్పాడిన మహాకూటమిలో ప్రారంభం నుండి సీట్ల గురించి గొడవలు అవుతూనే వున్నాయి. సీట్లు కల్పిస్తే కూటమిలో వుండటం లేకపోతే కూటమి నుండి బయటకు వెళ్ళడం లాంటిది జరుగూతూనే వున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్ రెడ్డిని రాజేంద్ర నగర్ నుంచి బరిలోకి దించాలని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ తొలి, మలి విడుతల్లో కర్తిక్ రెడ్డి పేరును ప్రకటించలేదు.దీంతో టీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చుకున్నారు. పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి దక్కింది. దీంతో కార్తిక్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వని పార్టీలో తానెందుకు కొనసాగాలని గురువారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పంపారు. తన రాజీనామా ఆమోదిస్తారో.. లేదా రాజేంద్రనగర్ సీటు ఇస్తారో తేల్చుకోవాలని కార్తీక్ రెడ్డి లేఖలో కోరారు.





తనతో పాటు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజీనామా చేస్తారని కార్తిక్ రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధికి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ స్థానం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్‌కి కూడా నిరాశే ఎదురైంది. మరి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రాజేంద్ర నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకాష్ గౌడ్ వున్న విషయం తెలిసిందే. 2014 నుంచి ఆయనే అక్కడ తిరుగులేని నాయకుడిగా గెలుస్తున్నారు.