ప్రభుదేవా కు సడన్ షాక్

SMTV Desk 2017-07-21 17:35:38  prabhudeva, dabang 3, salmankhan, arbaj khan, sabeer khan, tiger jinda hai

చెన్నై, జూలై 21: ప్రభుదేవా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అదలా ఉండగా ప్రభుదేవా కు ఇంకో షాక్ తగిలింది. సల్మాన్ ఖాన్‌ ‘దబాంగ్‌’ సీక్వెల్‌కు దర్శకత్వం వహించే అవకాశం చే జారినట్టు తెలుస్తుంది. " దబాంగ్‌ 3 " సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ అయితే ఇప్పుడు ఆ అవకాశం "బాగి" ఫేమ్‌ సబీర్‌ఖాన్‌కు దక్కినట్టు సమాచారం. దబాంగ్‌ నిర్మాతలు సబీర్ ఖాన్‌ ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఖాన్‌ ఈ సినిమా కోసం మూడు నాలుగు స్క్రిప్ట్‌లపై పనిచేస్తునట్టు సమాచారం. దీనిపై సబీర్‌ ఖాన్ మీడియా తో మాట్లాడుతూ ... "దబాంగ్‌ 3" సినిమా పని ప్రారంభించాం. కథ పూర్తయ్యే వరకు నేనేమీ చెప్పలేను ఫైనల్‌ స్క్రిప్ట్‌ పూర్తయ్యాక దర్శకుడిగా ఎంపికైతే సంతోషిస్తాను” అని చెప్పారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం "ఏక్తా టైగర్" కు సీక్వల్ గా తెరకెక్కుతున్న "టైగర్ జిందాహై"తో సల్మాన్‌ బిజీగా ఉన్నారు.