తెలంగాణ ఎన్నికలకు మావోయిస్టుల పంచ్

SMTV Desk 2018-11-05 15:02:56  Telangana Elections, Maoists, Andrapradesh Police, Rajath Kumar, AP DGP

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణాలో రాబోతున్న ఎన్నికల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులను కూడా బందోబస్తుగా నియమించాల లేదా అని ఈ రోజు నిర్ణయించుకుంటారు అని సమాచారం. తెలంగాణలో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తారంటూ..తెరాస నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఈసీ రజత్ కుమార్ ఏపీ పోలీసులను తెలంగాణకు కేటాయించవద్దని కేంద్రానికి సూచించారు.. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పోలీసులను పంపడానికి సిద్ధంగా ఉండాలని ఏపీ డీజీపీకి సూచించింది దీంతో కాస్త చర్చకొనసాగింది. బందోబస్తు చర్యలపై ఎన్నికల కమిషన్‌ సోమవారం కీలక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో తమిళనాడు, కేరళ, కర్నాటక,ఛత్తీస్‌గడ్‌ అధికారులతో పాటు ఏపీ డీజీపీ, సిఎస్‌ కూడా పాల్గొననున్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం ఏపీ పోలీసులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదిలా వుండగా తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఓ వైపు మావోయిస్టుల హెచ్చరికలు, రాజకీయా నేతల వాడీ వేడి మాటలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమయింది. దీంతో ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు నిర్వహించాలని సీఈసీ నిర్ణయిచింది. దీనికోసం కేంద్ర పారామిలటరీ దళాలు, రాష్ట్ర పోలీసు బలగాలతో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపుతున్నారు.