హరీష్ రావు నీ వోదల్లేదు.

SMTV Desk 2018-11-01 16:27:40  Harish Rao, TRS, Telangana Elections

హైదరాబాద్ : తెలంగాణలో రానున్న ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు నోట్లకట్టలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు గట్టి నిఘా పెట్టినా వాహనాల్లో జోరుగా వెళ్లిపోతోంది డబ్బు. దీంతో మరింత పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు. ఎంత ప్రముఖుడి వాహనాన్నైనా ఆపేసి లోపలికి తొంగి తొంగి చూస్తున్నారు.

మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు వాహనాన్నీ పోలీసులు తనిఖీ చేశారు. హరీశ్ హుస్నాబాద్ పర్యటన ముగించుకుని సిద్దిపేటకు వస్తుండగా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కారును తనిఖీ చేసి, లోపల ఏమీ లేకపోవండంతో ‘ఇక వెళ్లిపోండి సార్. మా డ్యూటీ మేం చేశాం..’ అని అన్నారు. హరీశ్ ఎలాంటి భేషజానికి పోకుండా తనిఖీకి సహకరించారని పోలీసులు చెప్పారు.