రాష్ట్రంలో కొలువుల మేళా

SMTV Desk 2017-07-21 13:49:23  jobs telangana state, notifications, next week

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి శుభవార్త వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వచ్చేవారం దాదాపు రెండువేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్‌పీఎస్సీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో విడుదలచేసే ప్రకటనల గురించి కమిషన్ వర్గాల నుంచి సీఎస్ ఎస్పీ సింగ్ వివరాలు సేకరించారు. వచ్చేవారం నాలుగు రకాల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు సీఎస్‌కు వెల్లడించినట్టు తెలిసింది. 1800 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 67 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, పదుల సంఖ్యలో రేడియాలజిస్టులు, రేడియాలజీ విభాగం లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన తుది ప్రక్రియ పూర్తిచేసామని కేవలం విడుదల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.