కెసిఆర్... ఢిల్లీ లో కంటి వెలుగు

SMTV Desk 2018-10-31 12:44:48  KCR, Kanti Velugu, Congress leader Anjan Yadav

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభ్యత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేసింది.

కాగా దీనిపై ఇప్పటివరకు భిన్నభిప్రయాలు ఏర్పడుతూ వచ్చాయి. అయితే, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కంటి పరిక్షకై ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ తీరును విమర్శించింది . కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కంటి వెలుగు పథకం బాగుంటే మీరెందుకు ఢిల్లీ వెళ్లి పరీక్ష చేయించుకున్నారని ఆరోపించారు.

తెరాస పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సీఎం కెసిఆర్ ను ప్రగతి భవన్ నుండి ఇంటికి సాగనంపే సమయమా వచ్చింది అని అన్నారు .. రాష్ట్రం లో ఇసుక మాఫియా , నీటి ప్రాజెక్ట్స్ , అయ్యప్ప సొసైటీ భూముల పేరుతో అక్రమంగా దండుకున్నారని ఆరోపించారు .

గతం లో కెసిఆర్ అన్న మాటలు ఒక్కసారి నెమరు వెసుకుందాం ,‘కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఎప్పుడూ.. ఎక్కడా చేయని ప్రయత్నం. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మందికి ఉపయోగంగా ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలను కూడా ప్రభుత్వమే చేయిస్తుంది. కంటి వైద్యం కోసం ప్రజలు