గతంలో ఎక్కడ చూసినా దర్నాలే - కేటీఅర్

SMTV Desk 2018-10-27 15:25:30  trs, ktr, andrapradesh, telangana

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ అధికార పార్టీ మంత్రి కేటీఅర్ టింబర్ డిపో వ్యాపారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఅర్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణను విడదీస్తే చాలా గొడవలు జరుగుతాయని సీమాంధ్ర నేతలు భయపెట్టారు. కానీ దానికి పూర్తి భిన్నంగా మేము శాంతి పరంగా పాలన అందించామని మంత్రి కేటిఆర్‌ తెలిపారు.

అలాగే స్వార్ధ రాజకీయాల కోసం సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌లో గొడవలు సృష్టించేవారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గింది. తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. 2009లో ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. 2014లో ఏర్పడిన తెలంగాణ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గతంలో ఎప్పుడు చూసినా ఇందిరాపార్క్‌ వద్ద ప్రజలు ధర్నాలు చేస్తూ కనిపించేవారు. ఇప్పుడు ఆ సమస్యే లేకుండా పోయింది. పరిశ్రమలకు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు.