ఎన్నికల వేల కొత్త హామీలిచ్చిన ప్రతిపక్ష నేత

SMTV Desk 2018-10-26 18:35:04  ex mla, komati redyy, congress

నల్లగొండ, అక్టోబర్ 26: ఎన్నికలు వచ్చేంత వరకు రాజకీయనాయకులకు ఆగిపోయి ఉన్న ప్రాజెక్టులు కట్టడాలు, భవనాలు, ఏమీ గుర్తుకు రావు కావొచ్చు. అయితే తాజాగా కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల సహకారం వుంటే నల్లగొండను మోడల్ సిటీగా మారుస్తానని చెప్పుకొచ్చారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకుని పోరాటం చేస్తే, ఉద్యమంతో సంబంధంలేని వ్యక్తిని నాపై పోటీకి డబ్బులతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన నల్లగొండలో నా గెలుపు ఖాయమన్నారు. పోరాటాల గడ్డ, శ్రీకాంతాచారి లాంటి అమరుడిని కన్న జిల్లాలో కొమటిరెడ్డి దెబ్బ ఏంటో కేసీఆర్ కు చూపించాలని పిలుపు నిచ్చారు. నల్లగొండలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ అభివృద్ధికి వొక్క రూపాయ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. వొకవేళ వీరి పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిపోతాయ...? అది ప్రజలే నిర్ణయించాలి.