బీజేపీలో 'బీజేవైఎం' ప్రధానమైంది -భరత్ గౌడ్

SMTV Desk 2018-10-25 17:00:56  BJP, BJYM, TELANGANA ELECTIONS, BHARATH GOUD

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణలో రాబోయె ఎన్నికల సందర్భంగా ఈ నెల 26, 27, 28, తేదీల్లొ నగరంలోని పెరేడ్ గ్రౌండ్ లో 'బీజేవైఎం మహాసభలు' నిర్వహిస్తున్నట్లు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భరత్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఈ మహాసభలు ప్రతీ మూడు సంవత్సారలకొకసారి వొస్తాయని, బీజేపీలో 'బీజేవైఎం' ప్రధానమైందని తెలిపారు. అత్యధిక క్యాడర్ ఉన్నది 'బీజేవైఎం' నుంచే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో 'బీజేవైఎం' పాత్ర కీలకంగా ఉండబోతోందని స్పష్టం చేశారు.

దేశంలో ఉన్న యువమోర్చ ముఖ్య నేతలందరు ఈ సభలో పాల్గొంటారని భరత్ పేర్కొన్నారు. 27న కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభలను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఈ సభలకి పది మంది కేంద్ర మంత్రులు, పది రాష్ట్రాల సీఎంలు అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. 28న జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సభలో దాదాపు 2లక్షల మంది యువకులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేశారు. 'బీజేవైఎం' చేసిన పోరాటాలవల్లే కేసీఆర్ చాలా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. సీఆర్ యువకులను ఎలా మోసం చేశారో ఈ సభల్లో ఎండగడతామని తెలిపారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ కు తెలంగాణ యువకులు ఓటు ద్వారా బుద్ధి చెప్పబోతున్నారని తెలిపారు. మహాసభల అనంతరం గడప గడపకు వెళ్లి బీజేపీకి ప్రచారం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ యువకులు కేసీఆర్ ను విలన్ గా చూస్తున్నారని భరత్ గౌడ్ విమర్శించారు.