మహా కూటమి పేరు మారింది

SMTV Desk 2018-10-14 10:56:46  mahakutami, kcr,

కాంగ్రెస్‌ నేతృత్వంలో టిడిపి, టిజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న కూటమికి మీడియా మహా కూటమి అని పేరుతో సంభోదిస్తోంది. ఆ మహాకూటమికి ప్రజా కూటమిగా నామకరణం చేసుకొన్నాయి నాలుగు పార్టీలు. రెండు మూడు రోజులలోగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే ప్రొఫెసర్ కోదండరామ్ కారణంగానే సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ పూర్తికావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ జనసమితికి కనీసం 15 సీట్లు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే మరో చిక్కుముడి ఉంది. అది కూడా పూర్తయితే కానీ ప్రజా కూటమి రంగంలో దిగలేదు. దసరా పండుగ తరువాతే సీట్ల సర్దుబాట్లు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.