చిన్న తప్పిదం ప్రాణం మీదకి వచ్చింది

SMTV Desk 2018-10-12 14:47:10  Hyderabad, Qureshi Ahad,train accident

హైదరాబాద్‌, అక్టోబర్ 12: నిర్లక్ష్యంతో వందలాది మంది ప్రాణాలు వదిలేస్తునారు ఐనప్పటికీ ప్రాణం అంటే ఎవరకి ఆశ ఉంది . పదే పదే అదే పొరపాటు, చిన్నదా ? పెద్దదా ? తేడా లేదు చిన్న పొరపాటే కావొచ్చు దాని ప్రతి ఫలితం వొక నిండు ప్రాణం.....

వొక చిన్న తప్పిదం ఎలా ప్రాణాల మీదికి తెస్తుందో చెప్పడానికి నిదర్శనమే ఈ సంఘటన ... హైదరాబాద్‌ నగరంలోని ఓ రైల్వేస్టేషన్‌లో జరిగిన అనుకోని ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు వదిలేసాడు . మహారాష్ట్ర లాతూర్‌ జిల్లా అహ్మద్‌పూర్‌ నందూపూర్‌ రోడ్‌ కటీఫీ ప్రాంతానికి చెందిన ఖురేషీ ఆహద్‌(23) మటన్‌ దుకాణం వ్యాపారి. ఆయన బుధవారం రాత్రి నగరంలోని చంద్రాయణగుట్టలో బంధువుల ఇంటికి వెళ్లడానికి లాతూర్‌ నుంచి లింగంపల్లి స్టేషన్‌ చేరుకున్నాడు. ఎంఎంటీఎస్‌లో ప్రయాణించడానికి ఫలక్‌నుమాకు టికెట్‌ తీసుకున్నాడు. చూసుకోకుండా 4వనెంబరు ప్లాట్‌ఫాం వద్ద పట్టాలు దాటబోయోలోపు ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా దూసుకొచ్చింది . అతడిని గమనించిన రైలు డ్రైవర్‌ బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది. ముందుకు వచ్చిన రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఆహద్‌ ఇరుక్కుపోయాడు. ఇతడిని బయటకి తీయడానికి ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వొకపక్క జాకీతో రైలును కొంతపైకి లేపారు. ప్లాట్‌ఫాంను గడ్డపారలతో పగులగొట్టారు. చివరకు అదే రైలులో అహద్‌ను నాంపల్లి స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి 108లో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నడుము భాగం, కాళ్లు బాగా దెబ్బతినడంతో ఆహద్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మన జీవితంలో జరిగే విషయాలు వేగంగా జరగాలి అంటే మన ప్రాణాల సైతం వేగంగా వదిలేయాల్సి ఉంటుంది . ఎమ్ చేసిన ముందుచూపుతో వేవహరించండి .....