సిఎం కెసిఆర్ రైతుబిడ్డ: మంత్రి కేటిఆర్‌

SMTV Desk 2018-10-11 14:18:32  Telangana minister Ktr, Telanganabhavan, CM KCR , farmer

తెలంగాణ మంత్రి కేటిఆర్‌ గారు నిన్న తెలంగాణభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ రైతుబిడ్డ అందుకే రైతుల కష్టాలను తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మింపజేస్తున్నారు. రైతుబంధు, రైతుభీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తున్నారు. రైతులకు మేలు చేసే ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేశారు.... వాటిని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు వ్రాశారు. కాంగ్రెస్ పార్టీతో ఈ కేసులు, కోర్టులు, పంచాయితీలు ఎందుకని ప్రజాకోర్టులోనే తేల్చుకొందామనే ఉద్దేశ్యంతోనే మేము మా అధికారాన్ని, ప్రభుత్వాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళుతుంటే, కాంగ్రెస్ నేతలు ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతూ మళ్ళీ వాటిపై కూడా కోర్టులకు వెళ్ళి భంగపడుతున్నారు.రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తమలాగే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడుతో చేతులు కలిపి మహా కూటమి ఏర్పాటు చేస్తున్నారు.