రైతులకు రూ.2లక్షల రుణమాఫీ

SMTV Desk 2018-10-11 11:20:21   Gadwall, Congress election,Congress leader Malu Bhatti Vikramarka

రాబోతున్న ఎన్నికల్లో అధికారమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల హామీలను కురిపిస్తుంది . గద్వాల్ జిల్లాలోని జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికలు శంఖారాన్ని ప్రారంభించింది . బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ ఏర్పాటుచేసింది . ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ లెక్కలు లేకుండా పోయాయని ఆరోపించారు. లెక్కలు అడిగితే బూతులు మాట్లాడుతున్నారని, తెలంగాణలో అభివృద్ధి దుర్భినిలో వెతికినా కనపడటంలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తెల్లరేషన్‌కార్డు దారులకు 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.