వారి ప్రబావం వీరి పై పడింది ..... సంతోచంలో సింగరేణి కార్మికులు

SMTV Desk 2018-10-06 14:04:32  cole india,working people,Deliver bonuses

హైదరాబాద్ ,అక్టోబర్ 06: కోల్ ఇండియా సంస్థ దసరా దీపావళి పండుగల సందర్భంగా దేశంలో వివిద రాష్ట్రాలలో తన పరిధిలో ఉన్న బొగ్గు గనులలో పనిచేస్తున్న కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.60,500 బోనస్ ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ నుంచి కార్మికులకు బోనసులు పంపిణీ చేయబోతునట్లు ప్రకటించింది. బోనస్ తో పాటు పండుగల అడ్వాన్ ను కూడా ఇవ్వాలని కోల్ ఇండియా నిర్ణయించింది. ఇవికాక కార్మికులకు నెలవారి వచ్చే జీతం సుమారు రూ.50-60,000 ఉండనే ఉంటుంది. కోల్ ఇండియా ప్రకటించిన విధంగానే సింగరేణి సంస్థ కూడా బోనస్ ప్రకటించే అవకాశం ఉంటుంది . టిఆర్ఎస్‌కు ఎంతో కీలకమైన శాసనసభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి కనుక కోల్ ఇండియా ప్రకటించిన దానికంటే ఇంకా ఎక్కువే ఈయవచ్చు అని ఊహ కానీ తక్కువ చేయదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక సింగరేణి కార్మికులు కూడా జీతం, బోనస్, పండుగ అడ్వాన్స్ కలిపి సుమారు రూ.1.5 లక్షలకు పైనే ఈసారి అందుకొనే అవకాశం చాల ఉంది. సింగరేణి కోల్ ఇండియా బోనస్ ప్రకటించేసింది కనుక రెండు రోజులలోపు సింగరేణి సంస్థ కూడా బోనస్ ప్రకటించవచ్చుఅని సమాచారం . సింగరేణి కార్మికులు అందరూ భారీగా బోనస్ అందుకొన్న తరువాతే శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక టిఆర్ఎస్‌కు లబ్ది ఆశించవచ్చు .