కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం : ఆలంపూర్

SMTV Desk 2018-10-05 10:50:30   Alampur,telangana Congress Election Campaign,kcr

ఆలంపూర్,అక్టోబర్ 05: తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు నిన్న శక్తి పీఠమైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి గురువారం రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.టి-పిసిసి అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విజయశాంతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర రాజనర్సింహా,సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంత రావు, డికె అరుణ తదితరులు నిన్న ఉదయం ఆలంపూర్ చేరుకొంన్నారు. వారందరూ నిన్న ఉదయం 10 గంట్లకు జోగుళాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలంపూర్ పట్టణంలో బహిరంగసభ నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు . ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ‌కుమార్ ప్రాతినిథ్యం వహించారు . ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు . మళ్ళీ ఎన్నికల మొదలయ్యే వరకు వరుసగా కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడానికి వీలుగా తదుపరి సభల షెడ్యూల్ ఖరారు చేసుకొని మళ్ళీ ప్రజలలోకి వస్తారు. ముఖ్యనేతలు అందరూ ఒకే సభలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం చేసినట్లయితే ఎన్నికలు మొదలయ్యేలోగా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేయడం సాధ్యపడదు కనుక సీనియర్ నేతల అధ్వర్యంలో మూడు లేదా నాలుగు బృందాలను ఏర్పాటుచేసి ఒకే సమయంలో రాష్ట్రం నలుమూలల ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎన్నికల ప్రచార కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. శక్తిపీఠం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు , అయితే ఈ శక్తి పీఠం సెంటిమెంట్ ఏ మేరకు ఆ పార్టీకి కలిసివస్తోందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.