ఖబర్దార్ అంటున్న విజయశాంతి

SMTV Desk 2018-09-29 16:51:03  Vijayashanthi, TRs Elections, kcr,

చాలా కాలంగా కాంగ్రెస్‌ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి శనివారం గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రచార కమిటీలో ఆమె స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులైన సంగతి అందరికీ తెలిసిందే. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నన్ను దేవుడిచ్చిన చెల్లి అని ఒకప్పుడు కెసిఆర్‌ అనేవారు. ఆ చెల్లే ఇప్పుడు శత్రువుగా మారిన అన్నయ్యపై యుద్ధానికి వస్తోంది. కనుక సిద్దంగా ఉండమని ఆయనను హెచ్చరిస్తున్నాను. ఈ యుద్దంలో ప్రజల తరపున పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీతో కలిసి నేను శత్రువులను ఓడించడానికి వస్తున్నాను,” అని క్లుప్తంగా ముగించారు.