కొండగట్టు ఘటనలో ప్రాథమిక నిర్ధారణ...

SMTV Desk 2018-09-14 16:32:38  kondagattu bus accident,Investigation

ఇటీవల జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాద ఘటనన ఆర్టీసీ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచి 12 గ్రామాల్లో విషాదం నింపింది.ప్రమాదానికి కారణమైన అధికారులపై ఇటీవల మానవహక్కుల సంగం లో పిటిషన్ కూడా దాఖలైంది, భాద్యులైన ఎవ్వరిని వదలకూడదని పిటిషనర్ కోరడం జరిగింది. తాజాగా ఆర్టీసీ అధికారులు జరిపిన సర్వే లో డ్రైవర్ ఎదురుగా వస్తున్నవ్యాన్ ను ఢీ కొట్టి ఆ అయోమయం లో బ్రేకు కు బదులుగా ఎక్సలేటర్ ని తొక్కడం తో అదుపుతప్పి లోయలో పడి ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాధమికంగా నిర్ధారించారు. కాగా బస్సు ని నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ ఈమధ్యనే ఆర్టీసీ యాజమాన్యం నుండి ఉత్తమ డ్రైవర్ అవార్డును తీసుకున్నారు .ఈ ప్రమాదం లో డ్రైవర్ తో పాటు 62 మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించకపోవడం తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .