అసెంబ్లీ రద్దుపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

SMTV Desk 2018-09-12 13:37:59  High court, Telangana, Rapolu Bhaskar, Congress, Telangana

హైదరాబాద్: ముందస్తు తెలంగాణ శాసనసభ రద్దు చేయడం చట్టాల ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ నేత, న్యాయవాది రాపోలు భాస్కర్‌ హై కోర్ట్ లో వేసిన పిటీషన్ ను విచారణ అనంతరం న్యాయస్థానం కొట్టి వేసింది. ఇందులో చట్టాల ఉల్లంఘన జరగలేదని కావున తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ, 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని రాపోలు భాస్కర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు. కాగా విచారణ అనంతరం ఈ పిటీషన్ ను హై కోర్ట్ కొట్టివేసింది.