రాజకీయంగా దెబ్బతీసేందుకే కుట్ర

SMTV Desk 2018-09-11 11:23:31  Ex MLA, Jaggareddy, Congress, CM KCR, Harishrao

* ఎన్నికలకు ముందే కేసులు గుర్తుకొచ్చాయా * కేసీఆర్, హరీష్ రావు లపై కూడా నకిలీ పాస్ పోర్ట్ కేసులున్నాయి. * వారిని కూడా అరెస్ట్ చేయండి. * మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే కుట్రపూరితంగా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి మానవ అక్రమ రవాణా చేశారని వస్తున్న అభియోగాల్లో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయనను టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. . మంగళవారం గాంధీ ఆసపత్రిలో జగ్గారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు.. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. 2004 నుంచి లేని తొందర ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేయడంతో అందరికీ అర్థమైందన్నారు . తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌, ఆపద్దర్మ మంత్రి హరీష్‌ రావులపై కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో ఉన్నారని వారిని కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.