నేడే ప్రజా ఆశీర్వాద సభ

SMTV Desk 2018-09-07 11:08:41  TRS Ashirvad Sabha , KCR

* మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం. * తొలి నియోజకవర్గ సభకు ఏర్పాట్లు పూర్తి. హుస్నాబాద్: అనుకున్నట్టుగా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ నేడు తొలి నియోజకవర్గ సభను ప్రారంభించనున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ సభను నిర్వహిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభల్లో ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే పథకాలను కేసీఆర్ హుస్నాబాద్ లో ప్రకటించే అవకాశముంది. ఈ సందర్బంగా ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు ఏఎస్పీలు, 10 మంది ఏసీపీలు, 85 మంది ఎస్ఐలు, 860 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తును ఏర్పాటుచేశారు. అసెంబ్లీ రద్దు తర్వాత మొదటి సభ కావడంతో అందరి చూపు హుస్నాబాద్ వైపే ఉంది. ఎటువంటి హామీలు ఇస్తారో అని అన్ని వర్గాల ప్రజలు ఎదిరిచూస్తున్నారు.