తెలంగాణ అసెంబ్లీ రద్దు

SMTV Desk 2018-09-06 13:57:19  CM KCR, TRS,

* మంత్రిమండలి ఆమోదం * గవర్నర్ కు లేఖ అందజేత * 2.30 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ సిఫారసును గవర్నర్‌కు సీఎం కేసీఆర్ సమర్పించనున్నారు. అనంతరం టీఆర్‌ఎస్ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా కేసీఆర్ వెల్లడించనున్నారు. ప్రభుత్వ రద్దుకు సంబంధించి ప్రకటన చేసిన అనంతరం.. ఇవాళ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకోనున్నారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు.