గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంటపేలుళ్లకు 11 ఏళ్లు పూర్తి

SMTV Desk 2018-08-25 15:12:03  Hyderbad, Gokul Chat, 11 years

ఆగష్టు 25 2007 భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదం విసిరిన పంజాతో.. 42మంది క్రూరమైన చావు.. మరో యాభై మంది బ్రతికున్న చచ్చినట్టే. అంతటి దౌర్భగ్య పరిస్థితిలోకి నెట్టిన అతి భయంకమైన అమానుషమైన బాంబ్ పేలుళ్లు.. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ ఘటనలు. హైదరాబాద్‌తో పాటు యావత్తు దేశం ఉలిక్కిపడ్డ ఘటనలవి. జంట పేలుళ్ల కేసులో 11 ఏళ్లయినా పురోగతి కానరావడం లేదు. బాధితులు ఇంకా కొందరు మంచానికే పరిమితం అయ్యారు. లుంబినీ పార్క్‌,గోకుల్‌ చాట్‌ జంటపేలుళ్లకు సంబంధించి 11 ఏళ్లు కావస్తోంది. ఈ నెల 27న తుది తీర్పు రానుంది. ఉగ్ర దాడి జరిగి 25నాటికి 11 ఏళల్వుతోంది. ఈ పేలుళ్ల కేసులో నిందితులుగా అనిక్ షఫీక్ సయ్యద్(ఏ1), మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్(ఏ2), రియాజ్ భత్కల్(ఏ3), ఇక్బాల్ భక్తల్(ఏ4), ఫరూఖ్ షార్ఫూద్దిన్(ఏ5), మహ్మద్ సిద్ధి షేక్(ఏ6), అమీర్ రసూల్ ఖాన్(ఏ7) ఉన్నారు. షఫీక్ సయ్యద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్, మహ్మద్ సిద్ధి షేక్ జైలులో ఉన్నారు. కాగా, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్ఫూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధితులు కోరుకుంటున్నారు. జంట పేలుళ్ల కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఏడుగురి పేర్లతో కూడిన 1125 పేజీలతో మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు. కేసులో మొత్తం 286 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. మక్కా పేలుళ్ల తరువాత పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టువిచారణలో తేలింది