అర్చకులకు శుభవార్త

SMTV Desk 2018-08-25 11:37:00  CM KCR, Temple

రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇకపై ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి ఈ వేతనాలు అందుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరించినప్పుడు, పూజారుల వేతనాలను కూడా విధిగా సవరిస్తామని.. పూజారుల పదవీ విరమణ వయో పరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. జీతాల చెల్లింపు, పదవీ విరమణ వయో పరిమితి పెంపుకు సంబంధించి విధి విధానాలు తయారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.