కులాంతర వివాహం చేసుకుందని....

SMTV Desk 2018-07-28 14:59:31  telangana,siddipet,murder,

సిద్దిపేట, జూలై 28: జిల్లాలోని బెజ్జంకి మండలం వీరాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని చెల్లెను అన్నయ్య కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.