మొక్కలకు పుట్టిన రోజు

SMTV Desk 2017-07-08 11:19:03  telangana , harithaharam, kamareddy, plant, birth, day

కామారెడ్డి, జూలై 08 : రామడుగు గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మొక్కలను నాటి నిత్యం నీళ్లు పోస్తూ రోజు కాపాడుకోవడంతో చెట్లు పది అడుగుల ఎత్తులో పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హారితాహారం కార్యక్రమంలో భాగంగా రెండు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలకు పుట్టిన రోజు కార్యక్రమాన్నిచేపట్టారు. మొక్కలకు బెలూన్స్ కట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయ సిబ్బంది కొల్లా భూపతి రాజ్, రాజేందర్, పోచయ్య, లక్ష్మీరాజ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.