దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ఆరంభం..

SMTV Desk 2018-05-06 10:53:38  neet exam, mbbs, neet exam start, cbse

హైదరాబాద్. మే 6 : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) దేశవ్యాప్తంగా ఆరంభమైంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు రాతపరీక్ష విధానంలో ఈ పరీక్షను‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహిస్తున్నారు. ఉదయం 7.30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. 9.30 తరువాత కేంద్రంలోనికి ప్రవేశం నిలిపివేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి అనుమతించలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 13,26,725 మంది పరీక్షకు హాజరవుతున్నారని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈసారి నీట్‌కు మరిన్ని కఠిన నిబంధనలు విధించారు. సెల్‌ఫోన్‌లు, ఇయర్‌ ఫోన్స్, వాచీలు, చెవిదిద్దులు, ముక్కుపుడకలు ధరించి రావడాన్ని నిషేధించారు. అభ్యర్థులందరూ పొడుగు చేతుల దుస్తులు కాకుండా పొట్టి చేతులున్న దుస్తులనే ధరించి పరీక్షకు హాజరవ్వాలని సీబీఎస్‌ఈ వెల్లడించింది.