మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా?.. అయితే జాగ్రత్త!..

SMTV Desk 2017-07-07 14:29:34  chocolates, Drug,

హైదరాబాద్, జూలై 7 : చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు. కాని ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో కొన్ని దారుణమైన నిజాలు బయటపడ్డాయి. కాసులకు కక్కుర్తి పడి పిల్లలకు గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న విషయం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. మధుమాంకా పేరుతో ఐదు రూపాయలకు విక్రయిస్తున్న ఈ చాక్లెట్లను రాజస్థాన్ రాష్ట్రంలో తయారు చేసి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐఎస్ఓ మార్కుతో కూడిన 8,760 గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ శాఖాధికారులు స్వాధీనం చేసుకొని పరీక్షించగా వాటిలో గంజాయి ఉందని తేలడంతో నివ్వెరపోవడం అధికారుల వంతైంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.