ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్ ను ప్రారంభించిన కేటీఆర్

SMTV Desk 2018-05-01 13:04:09  KTR inaguration express way kandlakoya

కండ్లకోయ, మే 1: ఔటర్‌ రింగు రోడ్డులో భాగంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద ఓఆర్‌ఆర్ ఇంటర్ చేంజ్‌ను మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. దీంతో నేటి నుంచి కండ్లకోయ ఇంటర్‌చేంజ్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ఓఆర్‌ఆర్‌ 158 కిలోమీటర్లు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ 158 కి.మీ పొడవుతో నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.6,696 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. 2008 నుంచి దశలవారీగా ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌కు అనుమతిస్తూ వస్తున్నారు. 1.01 కి.మీ దూరం ఉండే కండ్లకోయ ఇంటర్‌చేంజ్‌ నిర్మాణం పూర్తవడంతో ఓఆర్‌ఆర్‌ 100 శాతం పూర్తి అయ్యింది.