తెలంగాణ బోనాల పండుగ సెలవు తేదీలో మార్పు

SMTV Desk 2017-07-06 17:00:18  telangana, bonalu, lashkar bonalu, july 17 holiday date

హైదరాబాద్, జూలై 6 : తెలంగాణ పండుగైన బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆషాడ మాసం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాల నుంచి గోల్కొండ బోనాలు జరుగుతున్నాయి. జూలై 9,10 తేదీలలో లష్కర్ బోనాల వేడుకలు జరుగనున్నాయి. అయితే, ఇది వరకు బోనాల పండుగ సెలవుని 10వ తేదీగా ప్రకటించారు. కాగా, ఈ సెలవు తేదీలో చిన్న మార్పు చోటుచేసుకొని జూలై 17వ తేదీకి సెలవు తేదీని తిరిగి ప్రకటించారు. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలోనే జారీ చేయనున్నట్లు బోనాల కార్యదర్శి వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణ బోనాలను గత సంవత్సర బోనాల కంటే ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది.