పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!

SMTV Desk 2018-04-25 11:39:12   police recruitment. Constable Recruitment Board

హైదరాబాద్‌, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆర్థిక శాఖ నుంచి పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటంతో వచ్చే వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు 90% కసరత్తు పూర్తిచేసినట్టు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22వేల పోస్టులకు అనుమతులు వచ్చినా అందులో ముందుగా పోలీస్‌శాఖలోని 18వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.