నేను గర్భవతిని కాను : ఇలియానా

SMTV Desk 2018-04-22 17:53:19  Ileana DCruz pregnant, ileana clarify doubts,

హైదరాబాద్, ఏప్రిల్ 22 : కథానాయిక ఇలియానా గర్భవతి అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలం నుండి ఇలియానా, ఆండ్రూ ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలియానాను ప్రశ్నించగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇష్టం లేదంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తానూ గర్భవతి అంటూ వార్తలు వస్తున్న వార్తలపై ఇలియానా.. ఎట్టకేలకు స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. "నేను గర్భవతిని కాను. ఈ ఫొటోను ఆండ్రూ నీబోన్‌ తీశారు" అని తెలిపింది. ఇటీవల ఇలియానా అజయ్ దేవగన్ సరసన "రెయిడ్" చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.