ముక్కులోంచి రక్తం కారుతోందా.? ఇలా ట్రై చేసి చూడండి

SMTV Desk 2018-04-20 17:55:26  nose bleeding, precautions, instructions.

హైదరాబాద్, ఏప్రిల్ 20 : బీపీ అధికంగా పెరగడం, ఉపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ముక్కుదూలం లోపల గాయం అవడం వలన సాధారణంగా ముక్కులోంచి బడబడా రక్తం కారుతుంది. దీనిని అదుపులో ఉంచాలంటే ఈ కింద ఇచ్చిన వాటిని ఓసారి ట్రై చేసి చూడండి. * మెడను మంచం అంచుకు చేర్చి, తలను వెనక్కు వాల్చాలి. అప్పుడు రక్తం బయటకు పొంగి రాకుండా ఆగుతుంది. * ఏ ముక్కు రంధ్రంలోంచి రక్తం కారుతోందా ఆ వైపున కంటికి కిందుగా ముక్కుదూలం మూలమీద గట్టిగా నొక్కి పెట్టండి. రక్తం కారడం ఆగుతుంది. * దానిమ్మ పూలను దంచి, రసం తీసి రక్తం కారుతున్న ముక్కులో చుక్కలుగా వేయండి. * పచ్చగడ్డి (గరిక) వేళ్లను శుభ్రంచేసి, మెత్తగా దంచి ఆ రసాన్ని చుక్కలుగా వేసినా రక్తం ఆగుతుంది. * పైవేమి దొరక్కపోతే ఎర్ర ఉల్లిపాయలు(నీరుల్లి) దంచి ఆ రసం ముక్కులో వేసినా రక్తం ఆగుతుంది. * తరచూ ఇలా రక్తం కారుతూ ఏడిపిస్తున్నప్పుడు శరీరానికి బాగా చలవ కలిగేలా చూసుకుంటూ, వేడిచెయ్యకుండా జాగ్రతగా ఉంటే ముక్కులోంచి రక్తం కారడం మాటిమాటికి జరగకుండా ఉంటుంది! * ఉసిరికాయలు పెద్దవి పచ్చడిపెట్టుకునేవి తెచ్చి, వాటిని మెత్తగా దంచి, ఆ గుజ్జును తలకు పట్టిస్తే మంచి చలవ. రక్తం కారడం ఆగిపోతుంది. * బూడిదగుమ్మడి హల్వా చేసుకోవడం, లేతగుమ్మడితో కూర, పప్పు వండుకోవడం, బూడిదగుమ్మడిని మెత్తగా దంచితే వచ్చిన నీటిని పంచదార పాకం పట్టుకుని తాగడం ఇలాంటివి చేస్తే శారీరకంగా చలవ కలిగి రక్తస్రావం ఆగుతుంది. ఇది అన్ని శారీరరంగాలలో జరిగే రక్తస్రావాలకు వర్తిస్తుంది. * అడ్డసరం పువ్వుల్ని మెత్తగా దంచి, నేతిలో వేయించి, పంచదార పాకం పట్టుకొని గాని, తేనే కలుపుకొని గానీ ఒకట్రెండు చెంచాల మోతాదులో రెండుపూటలా రోజూ తీసుకుంటే ముక్కులోంచి రక్తం కారడం ఆగుతుంది.