న్యూ లుక్‌లో మెరిసిన సెరెనా

SMTV Desk 2019-05-28 16:00:59  Serena Williams, fitness problems Serena Williams, new jersey

పారిస్: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ న్యూ లుక్‌ తో అదరగొట్టింది. మునుపు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా ధరించిన బ్లాక్‌ పాంథర్‌ క్యాట్‌ సూట్‌ వివాదాస్పదమైంది. దీంతో ఈసారి జీబ్రా చారలున్న సరికొత్త డ్రెస్‌తో సెరెనా బరిలోకి దిగింది.మ్యాచ్ ముందు కోర్టులోకి వచ్చేటప్పడు సెరెనా ధరించిన పైవస్త్రంపై అమ్మ, చాంపియన్‌, రాణి, దేవత అనే పదాలు ఫ్రెంచ్‌ భాషలో రాసి ఉన్నాయి. ఈ పదాలు అక్కడి అభిమానుల అందరినీ ఆకర్షించాయి. ఈ సరికొత్త డ్రెస్ ను విర్గిలబ్లోహ్, నైక్ లు రూపొందించారు. ఈ విషయాన్నీ సెరెనా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.