శ్రీరెడ్డి పై కేసు పెట్టిన నటుడు శివబాలాజీ..

SMTV Desk 2018-04-19 16:58:20  actor shivabalaji, pawan kalyan, complaint on srireddy, rayadurgam police station.

హైదరాబాద్, ఏప్రిల్ 19 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ కథానాయకుడు శివబాలాజీ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు అన్యాయం జరిగిందని తెలుగు చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డికి.. చట్టపరంగా వెళ్లి సమస్య పరిష్కరించుకో అంటూ పవన్ సలహా ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో శ్రీరెడ్డి పవన్ మాటలను తప్పుపడుతూ దుర్భాషలాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శించింది. పవన్‌ను ఎంతగానో అభిమానించే తాను ఆమె వ్యాఖ్యలతో కలత చెందానని, దీంతో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు శివబాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాజకీయంగా పవన్‌ను, జనసేనను దిగజార్చాలన్న దురుద్దేశంతో కొన్ని రాజకీయ శక్తులు ఇలా చేయించినట్లు తెలిపారు. శ్రీరెడ్డిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని శివబాలాజీ ఫిర్యాదులో కోరాడు.