సినిమా అంటే ఇష్టం.. కాని..! నటి భావోద్వేగపు పోస్ట్..

SMTV Desk 2018-04-13 12:19:22  actress madhavi latha, madhavi facebook emotional post, tollywood.

హైదరాబాద్, ఏప్రిల్ 13 : టాలీవుడ్ పై కాస్టింగ్ కౌచ్ ఉందంటూ గళం విప్పిన శ్రీరెడ్డి కంటే ముందే ప్రముఖ నటి.. నచ్చావులే ఫేం మాధవి లత.. చెప్తూ వస్తోంది. తను కూడా అలాంటి బెదిరింపు కాల్స్ ఎదుర్కొన్నానని, చాలా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొన్నానని వెల్లడించింది. తాజాగా మాధవి లత తనకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అని చెబుతూనే.. కాస్టింగ్ కౌచ్ పై ఒక భావోద్వేగపు పోస్ట్ పెట్టారు. "ఇది భయం కాదు మా బతుకు. ప్రేమతో వచ్చాం.. చావైనా రేవైనా ఇక్కడే జారిపోయేదిలేదు, పారిపోవడం అంతకన్నలేదు, కామం కాటికి కాలు చాపిన ముసలి వాడి కళ్ళలో కూడా జ్వలిస్తూనే ఉంది. అయినా బదిలీ ఔదామంటే అది లేనిదెక్కడా,? ఒక్క సినీ రంగమేనా? బతకాలంటే బరితెగించాలి లేదా బాధను దిగమింగాలి. చీకటిలో నలిగిపోయిన చెప్పకోలేని కథలు, విప్పలేని ముడులు ఎన్నో, కన్నీళ్ళతో కష్టం తీరిపోతే ఇన్నాళ్లుగా ఈ బాధలెందుకు? ఏరి కోరి వచ్చినందుకు పక్కలోకి చేరుకోవడం తప్పడం లేదు. అయినా మాకు ఈ సినిమా అంటే పిచ్చి ఇష్టం. మిమ్మల్ని నవ్వించడానికి మేము నవ్వుల పాలు కాక తప్పడం లేదు. అయినా మాకు సినిమా ఇష్టం. మేము చచ్చేవరకు మిమ్మల్ని ఆనందపెట్టడానికి మేకప్ తో వస్తూనే ఉంటాం" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.