నా కుమారుడిని క్రికెటర్ గా చూడాలనుకుంటున్నా..

SMTV Desk 2018-04-11 15:35:16  kareena kapoor, kareena son, taimur khan, taimur become a criketer.

ముంబై, ఏప్రిల్ 11 : బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ల ముద్దుల తనయుడు తైమూర్ నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో తన ఫోటోలు నిత్యం అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైన కరీనాను మీడియా పలు ప్రశ్నలు సంధించింది. తైమూర్ ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారు? అన్న మీడియా ప్రశ్నకు కరీనా స్పందించింది. తైమూర్ భవిష్యత్తులో ఏమవుతాడో తనే నిర్ణయించుకుంటాడని.. తనకు స్పష్టమైన అవగాహన లేదని తెలిపింది. కాని తను తైమూర్ ను ఒక క్రికెటర్ గా చూడాలనుకుంటున్నా అని తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించింది.