భర్తకు సన్నీలియోన్ ప్రత్యేక సందేశం..

SMTV Desk 2018-04-11 15:16:32  sunny leone, marriage day tweet, Daniel Weber

ముంబై, ఏప్రిల్ 11 : బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్.. తన భర్త డేనియల్‌ వెబర్‌కు ఓ సందేశం పంపారు. నేడు సన్నీలియోన్, డేనియల్‌ వెబర్‌ ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా సన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తన భర్తకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తమ పెళ్లి రోజున దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. "జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. ఒకరినొకరం ఎప్పటికీ ప్రేమించుకు౦టూనే ఉంటాం. అలా అని ఏడేళ్ల క్రితం దేవుడు ముందు ప్రమాణం చేశాం. ఆనాడు నిన్ను ఎంతగా ప్రేమించానో.. నేటికి అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా. లవ్ యూ సో మచ్ డేనియల్‌ వెబర్‌. పెళ్లిరోజు శుభాకాంక్షలు" అంటూ పోస్ట్ చేశారు. సన్నీలియోన్ దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. ఓ అనాథాశ్రమం నుంచి నిషా అనే పాపను దత్తత తీసుకొని.. సరోగసి ద్వారా మరో ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.