సూర్య పై వస్తున్న వార్తలు అవాస్తవం..

SMTV Desk 2018-04-11 12:48:54  YATRA MOVIE, YSR BIOPIC, SURYA IN YATRA MOVIE, MAHI RAGHAV.

చెన్నై, ఏప్రిల్ 11 : దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "యాత్ర" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ వైఎస్సార్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌ పాత్రలో సూర్య నటించనున్నారనే వార్త కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మహి రాఘవ్‌ ఖండించారు. ఈ చిత్రానికి సంబంధించి తాము సూర్యను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా జగన్‌ భార్య భారతి పాత్రలో నటించడానికి కీర్తి సురేశ్‌ పేరు సూచించామని, ఇప్పటికైతే ఆమెతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాని కీర్తి నటిస్తుందో.? లేదో.? ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని మహి రాఘవ్ తెలిపారు.