ఆ ఒక్క కారణంతో వారు నిర్దోషులయ్యారు...

SMTV Desk 2018-04-07 15:35:24  Black buck poaching case, bollywood, salman, saif ali, sonali, tabu.

ముంబై, ఏప్రిల్ 7 : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ 20ఏళ్ళ క్రితం రెండు కృష్ణ జింకలను చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్ లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇంతకు వీరంతా ఒక్క కారణంతో నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఇంతకు ఆ కారణం ఏంటంటే.. సైఫ్, టబు, సోనాలి, నీలమ్.. సల్మాన్‌తో పాటు జీపులో వెనుక ఉండి తుపాకీతో కాల్చమని సల్మాన్ ను ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కాని ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్ మాత్రం వారిని గుర్తు పట్టలేకపోయింది. కోర్టు అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వారేనా.? అనే సమాధానం పూనమ్ చెప్పలేకపోయింది. దీంతో జోథ్ పూర్ కోర్టు సైఫ్, టబు, సోనాలి, నీలమ్ లను నిర్దోషులుగా నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.